భారీ స్కోరు దిశగా దూసుకెళుతున్న శ్రీలంక

  • 95 పరుగుల వద్ద ఔటైన తరంగ
  • దూకుడుగా ఆడుతున్న లంక బ్యాట్స్ మెన్
  • రెండు వికెట్లు తీసిన కుల్దీప్ యాదవ్
విశాఖపట్నంలో జరుగుతున్న చివరి వన్డేలో శ్రీలంక భారీ స్కోరు దిశగా సాగుతోంది. 33 ఓవర్లు ముగిసే సరికి శ్రీలంక నాలుగు వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. దూకుడుగా ఆడిన శ్రీలంక ఓపెనర్ ఉపుల్ తరంగ 95 పరుగుల (82 బంతులు, 3 సిక్సర్లు, 12 ఫోర్లు) వద్ద ఔటై తృటిలో సెంచరీ మిస్ అయ్యాడు. సమరవిక్రమ 42, డిక్ వెల్లా 8 పరుగులు చేసి ఔట్ అయ్యారు. తరంగ, గుణరత్నేలను కుల్దీప్ యాదవ్ ఔట్ చేయగా, సమరవిక్రమను చాహల్ పెవిలియన్ చేర్చాడు. ప్రస్తుతం మ్యాథ్యూస్ (16), గుణరత్నే (6) క్రీజులో ఉన్నారు. 
Go Back to Shorts
visakhapatnam one day
team india
sri lanka cricket

More Telugu News